మేడారం జాతరకు ఈ సారి రూ.80 కోట్లు మంజూరు చేశాం!: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

02-01-2018 Tue 20:58 | Both States
  • ఈ నెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు మేడారం జాత‌ర‌
  • వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది వ‌చ్చే అవ‌కాశం
  • గ‌త జాతరకు 90 ల‌క్ష‌ల మంది భ‌క్తుల హాజరు 
  • ఈ జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాలని కేంద్ర మంత్రిని కోరిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
మేడారం సమ్మ‌క్క‌, సారల‌మ్మ జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి జూయేల్ ఓరాంను కోరిన‌ట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించిన‌ట్లు చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. దాదాపు కోటి మంది భ‌క్తులు పాల్గొనే ఈ పండుగ ప్ర‌పంచంలోనే అతిపెద్ద గిరిజ‌న పండుగ అని కేంద్ర మంత్రికి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే మేడారం జాత‌ర‌కు తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం తొలి సంవ‌త్స‌రం 180 కోట్ల‌ను మంజూరు చేసింద‌ని, ఈ సంవ‌త్స‌రం 80 కోట్లు మంజూరు చేసింద‌ని మంత్రి తెలిపారు. ఈ నెల‌ 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు జ‌రిగే మేడారం జాత‌ర‌లో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పాల్గొన‌వ‌చ్చ‌ని భావిస్తున్న‌ట్లు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. గ‌త జాతరలో 90 ల‌క్ష‌ల మంది భ‌క్తులు పాల్గొన్నార‌ని, ఈ సారి ఆ సంఖ్య మ‌రింత‌గా పెరిగే నేప‌థ్యంలో సౌక‌ర్యాల విష‌యాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇప్ప‌టికే మేడారం జాత‌ర జ‌రిగే పుణ్య‌స్థ‌లానికి నాలుగు లైన్ల రోడ్లు, మౌలిక వ‌స‌తులు, ప‌రిశుభ్ర‌త సంబంధించి అన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, మంత్రి చందూలాల్ తో క‌లిసి మేడారంకు వెళ్లి జాత‌ర ప‌నుల పురోగ‌తిని స‌మీక్షించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు జార్ఖండ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి భారీగా భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.      
indrakaran reddyEndowmentsmedaram jathara

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more